విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల బాగోగులు చేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఇంటి పెద్ద కొడుకు లాగా బాధ్యతలు చేపట్టి అండగా నిలుస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్,బిషప్ గ్రాసి స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్ నందు ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ క్యాంప్ ప్రారంభించి అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎవరూ చేయనివిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది పాలనలో వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య సిబ్బంది, వలంటీర్ లను ఇంటింటికి పంపించి ఇంటి వద్దనే షుగర్, బీపీ, రక్తపరిక్షలు ఉచితంగా నిర్వహించి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో వైద్య సహాయం అవసరమైన వారికి మరిన్ని వైద్య పరీక్షలు చేయడానికి ఈ విధంగా మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్ లలో చేర్పించి ఉచితంగా ఆపేరేషన్ లు, వైద్యం అందిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమం వినియోగించుకోవాలని అవినాష్ పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రజల ఆరోగ్యము గురుంచి, వారి బాగోగులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండప్రాంత వాసులు కిందకి వచ్చే పనిలేకుండా పెన్షన్లు, సంక్షేమ లబ్ది నేరుగా ఇంటి వద్దకే అందిస్తున్నామని, వారికి వైద్య సహాయం కొరకు వైయస్సార్ అర్బన్ క్లినిక్, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగనన్న అని కొనియాడారు. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి దాదాపు 90 లక్షల మందికి ఒక్కరోజు లోనే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం ఒక రికార్డ్ అని, అదేవిధంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కూడా చరిత్రలో నిలిచిపోతుంది అని ఉద్ఘటించారు. ఒకపక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ మనుగడ కోసం ప్రజల మధ్య కులాల కుంపట్లను రాజేయాలని చూడటం సిగ్గుచేటు అని, మీరెన్ని కుట్రలు చేసిన ప్రజల గుండెల్లో జగన్ సంక్షేమ సంతకం తొలగించడం జరగదని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి,డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెహబూబ్,జోనల్ కమిషనర్ కృష్ణ,EE చంద్రశేఖర్,వైసీపీ నాయకులు అధికారులు వైసీపీ ముఖ్య నాయకులు కోటి నాగులు,చందా కిరణ్,చినబాబు,కనపర్తి బాబు,మెయిన్,సుభాషిణి,పెద్దబాబు మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News