Breaking News

మాస శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరమశివునికి ప్రీతిపాత్రమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. సృష్టి లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *