-మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి.
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బుధువారం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. ప్రతి రోజు జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పనుల వేగం పెంచుతున్నారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులలో భాగంగా కారిడార్ చుట్టూ నిర్మాణం జరుగుతున్న ప్రహరి గోడ పనులను మరియు ప్రహరి గోడ ప్రక్కన ఏర్పాటు చేసిన గ్రీనరీని పరిశీలించి ఖాళీగా ఉన్న ప్రదేశములో పూర్తి స్థాయిలో గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు. లైటింగ్, గ్రానైట్, పాత్వే, వాటర్ ఫౌంటైన్, వెహికల్ పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, సుందరీకరణ తదితర పనులను పరిశీలించి కమిషనర్ మ్యూజియం, థియేటర్ సందర్శించి అక్కడ ఎలక్ట్రిసిటీ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భములో జరుగుచున్న నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. ఈ అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించినలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News