Breaking News

1,896 మంది పశు సంవర్ధక సహాయకుల నియామకం

-నిరుద్యోగ యువతీ, యువకులకు ఏపీ పశుసంవర్థక శాఖ శుభవార్త
-డిసెంబర్ 2023 రెండవ వారంలో నియామక సంబంధిత పరీక్షలు
-పూర్తి పారదర్శకంగా పశు సంవర్ధక సహాయకుల నియామకం
-రాష్ట్ర పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య శాఖామాత్యులు సీదిరి అప్పల రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పశుపోషకులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గుమ్మం వద్దనే పశువైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో మరియు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా 1,896 మంది పశు సంవర్ధక సహాయకుల నియమకాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మాత్యులు సీదిరి అప్పల రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. పశు సంవర్ధక సహాయకుల నియామకానికి సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 2023 రెండవ వారంలో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొదటి విడతలో 3,033 పశుసంవర్ధక సహాయకులను, రెండవ విడతలో 1,619 పశుసంవర్ధక సహాయకులను మొత్తంగా 4,652 పశుసంవర్థక సహాయకులను రైతు భరోసా కేంద్రాలలో నియమించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా నిర్వహించబడిందన్నారు. అదేవిధంగా త్వరలో చేపట్టనున్న పశుసంవర్థక సహాయకుల ఉద్యోగాల భర్తీని కూడా పూర్తి పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. కావున అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సంసిద్ధులు కావలసినదిగా కోరుతూ మంత్రి సీదిరి అప్పల రాజు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *