-జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టిఆర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాల పోస్టుల భర్తీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ మైలవరం చిల్లకల్లు నందిగామ మరియు తిరువూరు పరిధిలో రెండు అంగన్వాడి కార్యకర్త పోస్టులు, 61 అంగన్ వాడి సహాయకురాల పోస్టులను రోస్టర్ను అనుసరించి భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. పోస్టులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానిక వివాహిత మహిళాలైన వారికి మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈనెల10వ తేది లోపు అందజేయవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంభందిత ఐసిడిఎస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News