-రాష్ట్ర అధికార భాషా కమీషన్ చైర్మన్ పి.విజయ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వృత్తిని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటూ సుదీర్ఘ కాలం జర్నలిస్టులుగా, రచనా వ్యాసంగంలోను రాణించిన వారు వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం ఆనందించదగ్గ పరిణామమని రాష్ట్ర అధికార భాషా కమీషన్ చైర్మన్ పి.విజయ బాబు అన్నారు. వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్న ప్రముఖ జర్నలిస్టులు, రచయితలకు స్థానిక సి. ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దశాబ్దాల క్రిందట నుంచి పాత్రికేయ వృత్తిలో, రచనా వ్యాసాంగంలో లబ్దప్రతిష్ఠులైన వారిని ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం గుర్తించి గౌరవించడం గొప్ప సాంప్రదాయంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర స్థాయి అవార్డుల సభ అనంతరం జర్నలిజం, రచనా వ్యాసాంగంలలో అవార్డులు పొందిన వారిని సి.ఆర్ మీడియా అకాడమీ సత్కరించడం ఆత్మీయ సమ్మేళనంగా భావించాలన్నారు. పాత్రికేయ కుటుంబానికి కొమ్మినేని శ్రీనివాసరావు తమ అకాడమీ వంతుగా చక్కటి ఆత్మీయతను పంచారని అన్నారు. సునిశితంగా, సున్నితంగా వ్యవహరించడం కొమ్మినేని వారి విశిష్టత అని ఆయన కొనియాడారు.
సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ, ప్రతిభకు పట్టం కట్టడం ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం గొప్పతనమని అన్నారు. అనేక సందర్భాల్లో జర్నలిజం రంగంలో తమ తో కలిసి పనిచేసిన మిత్రులందరిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం తమ బాధ్యత గా భావించానని, అందుకు అంగీకరించి విచ్చేసిన వవై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కార గ్రహీతలక ఎ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 46 ఏళ్ళతమ జర్నలిస్టు కెరీర్ లో తమతో కలిసి పనిచేసిన అనేక అంశాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
గౌరవ అతిథి గా విచ్చేసిన మేడపాటి వెంకట్ మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో నిష్ణాతులైన మిత్రులందరూ ఒకచోట చేరి వారి గత స్మృతులను స్మరించుకోవడం మరపు రాని అనుభూతి అన్నారు. ఇందుకు కారణమైన మీడియా అకాడమీ చైర్మన్ ను ఆయన అభినందించారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్. కృష్ణం రాజు మాట్లాడుతూ, చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాస రావు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ సంస్థ అనేక ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. పాత్రికేయులు, మేధావులు, కళాకారులు అందరూ ఈ కార్యక్రమాల్లో.. భాగస్వాములయ్యారన్నారు. నిరంతరం సత్సంగంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతి రావు మాట్లాడుతూ, పాత్రికేయులను నిరంతరం గుర్తించి గౌరవించడంలో మండియా అకాడమీ తన వంతు కృషి చేయడం హర్షణీయమన్నారు. చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం లోని అన్ని జిల్లాలు విస్తృతంగా పర్యటించి గ్రామ గ్రామాల్లో వున్నా రిటైర్డ్ జర్నలిస్టుల్ని ప్రభుత్వం తరపున సత్కరించిన విధానం తమకు సంతోషాన్నిచ్చిందన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. పి. రామకృష్ణ మాట్లాడుతూ, ఆన్ లైన్ క్లాసుల ద్వారా ప్రతి వారం జర్నలిస్టులకు వివిధ అంశాల పై ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా మీడియా అకాడమ’ యువ జర్నలిస్టులకు అవగాహన కలిపిస్తోందన్నారు. “పెన్” జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు బడే ప్రభాకర రావు మాట్లాడుతూ. జర్నలిస్టుల కు ప్రయోజనం చేకూర్చే అంశాలను పరిష్కరించడంల చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కార గ్రహీతల అనుభూతులు:
ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కార గ్రహీత లు, ప్రముఖ పాత్రికేయులు, రచయితలు తమ అనుభవాలను, అనుభూతులను గుర్తు చేసుకున్నారు. గోవిందరాజు చక్రధర్ మాట్లాడుతూ, ఈ అవార్డు సమాజానికి తమనుంచి మరింత మంచి రచనలు ఇచ్చేలా ప్రేరణ కల్పించిందన్నారు. శత వసంతాల రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన కలిగిందన్నారు. మహమ్మద్. ఖాదిర్ బాబు మాట్లాడుత నా రచనల లో సామాజిక బాధ్యతను మరింతగా మేలుకొలిపేలా ఈ అవార్డు ప్రేరణ కలిగించిందన్నారు. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తమ జర్నలిజం కెరీర్ లో “పతంజలి” ఎంతో ప్రోత్సహించిన వశిషయాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లావఝుల శివాజీ మాట్లాడుతూ, పుస్తక పఠనం, జర్నలిస్టు పెద్దల్ని కలవడం తమకు ఏంతో ఆనందం కలిగించే విషయాలన్నారు. హనుమంత రెడ్డి కె.మాట్లాడుతూ జర్నలిజం తాము తమ జీవితావసరంగా భావించానని. దానిపట్ల మక్కువ పెంచుకున్నాని అన్నారు. ఏది నిజమో అదే రాసే కొమ్మినేని శ్రీనివాసరావుకు తాము పెద్ద ప్యాన్ ను అని” ఆయన అన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ వందన సమర్పణ చేశారు.
ఈ సమావేశంలో సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఓ.ఎస్.డి. ఎస్. శ్రీనివాస జీవన్, అకౌంట్స్ అధికారి ఎం.ఎస్. ఎన్ మూర్తి, డి. పి. ఓ . ఎం. లోవ రాజు పలువురు అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News