Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ ఏ ఈ ఓ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ ఏ ఈ ఓ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అమ్మవారి దర్శనానికి ముందు మంత్రి గారికి రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు సహాయ వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య సాదర స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *