Breaking News

‘స్మార్ట్‌’ బోధ‌న‌తో మెరుగైన నైపుణ్యాలు

– రాష్ట్ర ఉపాధి క‌ల్ప‌న‌, శిక్ష‌ణ డైరెక్ట‌ర్ బి.న‌వ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మేళ‌వింపుతో రూపొందించిన స్మార్ట్ డిజిట‌ల్ బోధ‌న‌తో ఐటీఐ విద్యార్థుల‌కు మ‌రింత మెరుగైన శిక్ష‌ణ నైపుణ్యాలు సొంత‌మ‌వుతాయ‌ని రాష్ట్ర ఉపాధి క‌ల్ప‌న‌, శిక్ష‌ణ డైరెక్ట‌ర్ బి.న‌వ్య అన్నారు. స్థానిక ప్ర‌భుత్వ ఐటీఐ క‌ళాశాల‌లో వీగార్డ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద రూ. 7.24 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ఏర్పాటుచేసిన స్మార్ట్ త‌ర‌గ‌తి గ‌దిని రాష్ట్ర ఉపాధి క‌ల్ప‌న‌ శిక్ష‌ణ డైరెక్ట‌ర్ న‌వ్య క‌నెక్ట్ టు ఆంధ్ర సీఈవో కోట్ల శివ‌శంక‌రరావు, వీగార్డ్ ప్ర‌తినిధుల‌తో క‌లిసి గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ న‌వ్య మాట్లాడుతూ వివిధ ట్రేడ్ల‌కు సంబంధించి ప్ర‌స్తుత పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగైన శిక్ష‌ణ నైపుణ్యాలు అందిస్తుంద‌న్నారు. విద్యార్థులు మ‌రింత మెరుగైన నైపుణ్యాల‌ను సొంతం చేసుకునేందుకు స్మార్ట్ త‌ర‌గ‌తి గ‌ది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఙానంతో మేళ‌వించిన ఈ డిజిట‌ల్ త‌ర‌గ‌తి గ‌దిలో విజువ‌ల్ ఎఫెక్ట్ ద్వారా అందించే పాఠ్యాంశాలు విద్యార్థులు కాన్సెప్టుల‌పై ప‌ట్టు సాధించేందుకు, ప్రాక్టిక‌ల్ ప‌రిజ్ఞానాన్ని స‌ముపార్జించుకునేందుకు ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని వివ‌రించారు. ఈ తర‌గ‌తిగ‌దిని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. విద్యార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ అందించేందుకు స్మార్ట్ త‌ర‌గ‌తిగ‌దిని స‌మ‌కూర్చిన వీగార్డ్ సంస్థ‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. వీగార్డ్ స్ఫూర్తితో విద్యారంగ అభివృద్ధికి వివిధ సంస్థ‌లు ముందుకు రావాల‌ని కోరారు.

రాష్ట్రంలో అన్ని ప్ర‌భుత్వ ఐటీఐల్లో స్మార్ట్ త‌ర‌గ‌తిగ‌దుల ఏర్పాటుకు కృషి: క‌నెక్ట్ టు ఆంధ్ర సీఈవో శివ‌శంక‌ర‌రావు
వీగార్డ్ సంస్థ స‌హ‌కారంతో విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వ ఐటీఐలో ఏర్పాటుచేసిన స్మార్ట్ త‌ర‌గ‌తి గ‌దిని మ‌రింత ప్రామాణీక‌రించి.. దీన్ని ఆద‌ర్శంగా తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్ర‌భుత్వ ఐటీఐల్లో ద‌శ‌ల వారీగా స్మార్ట్ త‌ర‌గ‌తిగ‌దుల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు క‌నెక్ట్ టు ఆంధ్ర సీఈవో కోట్ల శివ‌శంక‌ర‌రావు వెల్ల‌డించారు. మొత్తం 83 ఐటీఐల్లోనూ స్మార్ట్‌గా విద్యార్థులు నైపుణ్యాలు సంపాదించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఐటీఐల్లోని పేద విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు అందించి.. భ‌విష్య‌త్ కెరీర్ ప‌రంగా ఉన్న‌త అవ‌కాశాలు పొందేందుకు ఇలాంటి చ‌ర్య‌లు దోహ‌దం చేస్తాయ‌ని వివ‌రించారు. స్మార్ట్ త‌ర‌గ‌తి గ‌ది ఏర్పాటులో భాగ‌స్వాములైన ప్ర‌తిఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు సీఈవో శివ‌శంక‌ర‌రావు తెలిపారు.
కార్య‌క్ర‌మంలో వీ-గార్డ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పి.కె.రాజేష్‌, మార్కెటింగ్ సీనియ‌ర్ అధికారి డి.రాజ్‌శేఖ‌ర్‌, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జి.మునివెంక‌ట నారాయ‌ణ‌, జేడీ జి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఐటీఐ ప్రిన్సిప‌ల్ ఎం.క‌న‌కారావు, ఐటీఐ సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *