Breaking News

తెలంగాణ ఎన్నిక‌లు దృష్ట్యా మ‌ద్యం, డ‌బ్బు అక్ర‌మ ర‌వాణాలకు అడ్డుక‌ట్ట వేయండి.

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 30న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నిక‌లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మ‌ద్యం, డ‌బ్బు వంటి వాటి అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డే వారిపై గ‌ట్టి నిఘా పెట్టి అడ్డుక‌ట్ట వేయాల‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు సంబంధిత అధికారుల‌కు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల దృష్ట్యా అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన ప‌టిష్ట నిఘా, త‌నిఖీల‌పై గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు,సూర్యాపేట జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.వెంక‌ట‌రావులు సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో జగ్గయ్యపేట మండ‌లం, చిల్ల‌క‌ల్లు టోల్‌ప్లాజా వ‌ద్ద జీఎంఆర్ మీటింగ్ హాల్‌లో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల దృష్ట్యా ఎన్‌టీఆర్ జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతంలో ప‌టిష్ట‌మైన త‌నిఖీల‌ను నిర్వ‌హించేందుకు రెండు బృందాల‌ను ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. ఈ బృందాల్లో పోలీస్‌, రెవెన్యూ, ఇన్‌కం ట్యాక్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్‌, బ్యాంకు అధికారులు, ఎక్సైజ్‌, అట‌వీ శాఖల అధికారులు ఉంటార‌న్నారు. రెండు బృందాలు 24 గంట‌లూ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో నిరంత‌ర నిఘా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు అనుమానిత వ్య‌క్తులు, వాహ‌నాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించాల‌ని.. ఎటువంటి అక్ర‌మ ర‌వాణా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు అనుమానం వ‌స్తే సంబంధిత వ్య‌క్తుల‌ను విచారించి, అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న‌ట్లు నిర్ధార‌ణ అయితే త‌క్ష‌ణ‌మే వారిపై చ‌ర్య‌లు తీసుకొని నివేదికలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించామ‌న్నారు. అక్ర‌మ ర‌వాణాలో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తులకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంత జిల్లా క‌లెక్ట‌ర్‌కు, ఉన్‌‌తాధికారుల‌కు స‌మాచారం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డే వ్య‌క్తులు ఎంత‌టివారైనా వారిపై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.
స‌మావేశంలో సూర్యాపేట జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.వెంక‌ట‌రావు, నందిగామ ఆర్డీవో పి. సాయిబాబా, జగ్గయ్యపేట తహసిల్దార్ సూర్యారావు, నందిగామ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, సూర్యాపేట, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *