Breaking News

అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ (అర్బన్‌), విజయవాడ (రూరల్‌), మైలవరం, చిల్లకల్లు, నందిగామ, తిరువూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టల పరిధిలో రెండు అంగన్వాడి కార్యకర్త పోస్టులు, 61 అంగన్‌ వాడి సహాయకురాల పోస్టులను రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానిక వివాహిత మహిళలైన వారు మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సిడిపివో కార్యాలయాలను సంప్రదించి ఈనెల 10వ తేది లోపు ధరఖాస్తులు చేసుకోవాలని ఇతర వివరాలకు సంభందిత ఐసిడిఎస్‌ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *