Breaking News

విజిలెన్స్ అవగాహన వారోత్సవములు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుమార్ విశ్వజీత్, I.P.S., డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్) డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల మేరకు, ది. 01.11.2023 న బుధవారం కనక రాజు, రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి, విజయవాడ యూనిట్ వారి పర్యవేక్షణలో కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పటమట నందు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులకు విజిలెన్స్ అవగాహన వారోత్సవములు, 2023 సంభందించి ( 30.10.2023 నుండి 05.11.2023 వరకు ) జరుగుతున్న సందర్భంగా వారికి సంక్షేమ పధకాలు పక్కదారి పట్టకుండా చేయడం, ఆహార పదార్ధాల కల్తీ, అవినీతి రహిత సమాజ నిర్మాణం, పన్నులు, రుసుములు సక్రమంగా చెల్లించడం, సహజ వనరులు సంరక్షణ మొదలైన అంశాలు గురించి అవగాహన కల్పించడం వాటిపై విజిలెన్స్ శాఖా విధివిధానాలు గురించి చక్కగా విశ్లేషించి తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పటమట చుట్టుపక్కల వీధులలో “అవినీతి వద్దు – నిజాయితీ ముద్దు” “చేయి చేయి కలుపుదాం – అవినీతిని తరిమేద్దాం” అంటూ చక్కటి నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ది. 02.11.2023 న గురువారం నాడు SRR & CVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాచవరం నందు కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులకు పై అంశములపై అవగాహనా సదస్సు నిర్వహించి సదరు వివరణ లో వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేయడం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *