Breaking News

వైఎస్సార్ పింఛ‌న్ కానుకతో అవ్వాతాతలకు కొండంత ధైర్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ జరుగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 26 వ డివిజన్ మారుతీనగర్లో గురువారం స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ కు ధీటుగా రాలేదన్నారు. డోర్ డెలివరీ విధానం దేశంలోనే ప్రప్రథమని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. అలాగే పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని.. కానీ ఈ ప్రభుత్వంలో 65.54 లక్షల మందికి అందిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవని.. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏటా రెండు పర్యాయాలు నూతన పింఛన్లు అందిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో కేవలం 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వంలో 26,595 మందికి పెంచడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ఇందుకోసం ప్రతినెలా 7 కోట్ల 44 లక్షల 45 వేల 500 రూపాయలు పింఛన్ రూపంలో అందిస్తున్నట్లు తెలియజేశారు. అర్హతే ప్రామాణికంగా ప్రతిఒక్కరికీ పింఛన్ మంజూరు చేస్తూ.. సామాజిక పింఛన్లను రికార్డు స్థాయికి చేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, కోలా నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *