Breaking News

జగనన్న ప్రగతి పధం పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు సోమవారం రాష్ట్ర ఐటి విభాగం అధ్వర్యంలో ఈ నెల 18న సాయంత్రం 4గంటలకు విజయవాడ లో జరగనున్న జగనన్న ప్రగతి పధం ర్యాలీ పోస్టర్ ను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ఐటి విభాగం అధ్వర్యంలో ఈనెల 18న విజయవాడ జగనన్న ప్రగతి పధం పేరుతో గత టీడీపీ హయాంలో జరిగిన పాలన కి ప్రస్తుత జగనన్న హయాంలో జరిగిన పాలన మధ్య తేడాను ప్రజలకు తెలియచేసేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు అని నగరంలో ఉన్న వైకాపా శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ వేములకొండ తిరుపతి రావు,ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షులు నల్లమోతు ప్రసన్న బోస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు దోవారి పూర్ణ సాగర్, మరియు ఐటీ విభాగం సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *