Breaking News

ఏపి ఎఫ్ టి టి డి సి నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏపి ఎఫ్ టి టి డి సి నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.

బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధియేటర్ యాజమాన్యాల ప్రతినిధులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రదర్శనలకు ఆమోద యోగ్యమైన సినిమాల కు చెంది ప్రభుత్వం అనుమతించడం జరుగుతుందని , వాటిని మాత్రమే సినిమా హాల్లల్లో ప్రదర్శించాలి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సినిమాలు ప్రదర్శించే ధియేటర్ లకు ఏపి ఎఫ్ టి టి డి సి కి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి, ఆమేరకు బకాయిలు ఏమియు లేవని నిరంభ్యంతర ధృవ పత్ర పొందాల్సి ఉంటుందన్నారు. ఆక్రమంలో ధియేటర్ ల నిర్వహణ, వసతుల కల్పన కు చెంది నిర్దేశనం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. కొందరు ఆమేరకు చెల్లింపులు చేసివున్నా , కొందరు ఆమేరకు ఎన్ వో సి పొందలేదని, వెంటనే ఆమేరకు దరఖాస్తు చేసుకుని ధ్రువపత్రాలు అందచేయాలని కోరారు. ఉద్దేశ్య పూర్వకంగా బకాయిలు చెల్లించకుండా ఉన్న వారు వెంటనే ఆయా మొత్తాలు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ స్పష్టం చేశారు.

సినిమా థియేటర్ యజమానులకు వార్షిక అద్దె ఛార్జీలు/ స్థిరమైన అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల చెల్లింపుపై లైసెన్సింగ్ అథారిటీ నుండి వారి “ఫారం-బి” లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి వీలుగా వారికి “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి ప్రభుత్వం కార్పొరేషన్ (APSFTVTDC)కి అధికారం ఇచ్చిందన్నారు. కార్పొరేషన్ ద్వారా ఆమోదించబడిన చలనచిత్రాలు. కాలక్రమేణా, అద్దె ఛార్జీలు మినహాయించి , స్థిరమైన అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫారం-బి లైసెన్స్ 5 సంవత్సరాల కాలానికి పునరుద్ధరించబడినందున, కార్పొరేషన్ 5 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ను కూడా జారీ చేస్తోందని తేజ్ భరత్ పేర్కొన్నారు. . ఫారం-బి లైసెన్స్‌ని పునరుద్ధరించుకోవడానికి సినిమా థియేటర్లు ఒక సంవత్సరానికి నిర్ణీత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లిస్తున్నాయని మరియు మిగిలిన నాలుగు సంవత్సరాల ఛార్జీలను వారి సౌలభ్యం ప్రకారం చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ లక్ష్మి రమణి, సినిమా ధియేటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *