Breaking News

ఓటరు జాబితా నమోదు, పోలింగ్ కేంద్రాలు, స్వీప్ కార్యకలాపాలు పై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గత వారం రోజుల్లో నమోదైన ఫారం- 6, 7, 8 లు, వాటిపై తీసుకున్న చర్యలుపై రాజకీయ పార్టీల కు వివరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా నమోదు, పోలింగ్ కేంద్రాలు, స్వీప్ కార్యకలాపాలు పై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో జి. నరసింహులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి వచ్చిన సూచనలను రాజకీయ పార్టీలకు వివరించడం జరిగింది. జంక్ క్యారెక్టర్లు, పది మంది మించి ఓటర్లు ఒకే ఇంటి చిరునామా ఉన్న 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న వాటిని గుర్తించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల సూచన మేరకు వాటి వివరాలు ఆయా రాజకీయ పార్టీలకు తెలియ చేస్తామని నరసింహులు తెలిపారు. నియోజక వర్గాల వారిగా ఫోటో సారూప్య నమోదులు (డెమోగ్రాఫిక్ సారూప్య విశేషాలు పై తీసుకున్న చర్య వివరములు తెలియ చేశారు. నవంబర్ 16 నుంచి 21 వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తోలగింపు, ఓటరు కార్డు నందు సవరణల కొరకు దాఖలు అయిన దరఖాస్తుల వివరములు, ఆయా దరఖాస్తులపై యదార్థ స్థితిని వివరించారు. ఈ సమావేశమునకు జిల్లా స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల -ప్రతినిధులు బిజెపి బి. రామచంద్రరావు. కాంగ్రెస్ ఐ ఎన్ .రమేష్ (శ్యామ్) , వై ఎస్ ఆర్ సీపీ హెచ్.రాజశేఖర్, సిపిఎం ఎస్ ఎస్ మూర్తి లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *