విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత,పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 9వ డివిజన్,మోడ్రన్ మార్కెట్ పక్కన సందు,65వ సచివాలయంలో జరిగిన ఆంధ్రకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ ప్రభుత్వం లో ఆ సచివాలయం పరిధిలో అమలు చేసిన12,48 మందికి 4కోట్ల 70లక్షలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల డిస్ ప్లై బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనడానికి ఈ సచివలయమే నిదర్శనం అని, ఇక్కడ గాని,పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీలో గాని అధిక శాతంలో టీడీపీ అభిమానులు ఉన్న సరే వారికి కూడా అర్హతను బట్టి ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందజేయడం వైసీపీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది అని అన్నారు. అదే గత టీడీపీ ప్రభుత్వం లో డివిజన్ కు కేవలం వంద లోపే పెన్షన్లు ఇచ్చేవారు అని,అవి కూడా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి, వారికి లంచాలు ఇచ్చి ఆ పార్టీకే ఓటు వేస్తామని బ్రతిమిలాడితే ఇచ్చేవారు అని విమర్శించారు. కానీ నేడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు అయిన సరే మీ వద్దకు వచ్చి మాకు ఓటేస్తేనే సంక్షేమ లబ్ది అందుతుంది అని ఆడిగారా అని ప్రజలను ప్రశ్నించారు. కాబట్టి ఏ పార్టీ మీకు మంచి చేసింది అనేది ప్రజలు విజ్ఞత తో ఆలోచించాలి అని కోరారు. మేము సంక్షేమం, అభివృద్ధి లో రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చామ కాబట్టే దమ్ముగా ధైర్యంగా నేడు ప్రజల ముంగిటకు వచ్చి చేసిన మంచి చెబుతున్నామని, అదే గత ప్రభుత్వం లో మీరు ఏమి చేశారో చెప్పగలరా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ అయిన అధికారంలో ఉన్న ఐదేళ్ళ లో అమలు చేసారా అని సూటి గా ప్రశ్నించారు. జగన్ మరలా ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని లేకపోతే మరలా 50ఏళ్ళు వెనక్కు వెళుతుంది అని అన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు తో రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు,9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డివిజన్ అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ గద్దె కళ్యాణ్,మండల అధ్యక్షులు రిజ్వాన్,వైసీపీ నాయకులు సుబ్బరాజు,కాళీ,శ్రీనివాస్,నాగరాజు,కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News