Breaking News

ఆధార్ బయోమెట్రిక్ అప్ డేషణ్ క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పించన్ పంపిణీలో బయోమెట్రిక్ సమస్యల పరిష్కారానికే ఆధార్ బయోమెట్రిక్ అప్ డేషణ్ క్యాంప్ ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి తెలిపారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు పించన్ పంపిణీలో ఎదురవుతున్న బయోమెట్రిక్ సమస్యల పరిష్కారానికి బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ బయోమెట్రిక్ అప్ అప్ డేషణ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పించన్ పంపిణీ సమయంలో కొందరికి ఆధార్ బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అవ్వడం వలన పించన్ అందించలేక పోతున్నామని, అటువంటి వారిని వార్డ్ సచివాలయాల వారిగా గుర్తించి, సమస్య పరిష్కారానికి యుఐడిఏఐ కి రిపోర్ట్ పంపామని తెలిపారు. యుఐడిఏఐ రీజినల్ కార్యాలయ సిబ్బంది బుధవారం జిఎంసిలో స్పెషల్ బయోమెట్రిక్ అప్ డేషణ్ క్యాంప్ ఏర్పాటు చేసి, ఆయా పించన్దార్లకు ఆధార్ అప్ డేషణ్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ పి.ఓ. సాంబశివరావు, డి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ ఏపిఓ లక్ష్మీ, యుఐడిఏఐ రీజినల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *