Breaking News

సంక్షేమమే పరమావధిగా నాలుగున్నరేళ్ల పాలన

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 239 వ వార్డు సచివాలయ పరిధిలో తొమ్మిదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 239 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్, వై.వి.రావు ఎస్టేట్ లో విస్తృతంగా పర్యటించి.. 190 గడపలను సందర్శించారు. శివారు కాలనీ ప్రజలతో మమేకమై అర్జీలు స్వీకరించారు. ఇప్పటికే నగరాన్ని ఎంతో విస్తరించామని.. వినాయక్ నగర్, వై.వి.రావు ఎస్టేట్ లోనూ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యంగా ‘జగనన్న సురక్ష’ ద్వారా నియోజకవర్గంలో 36,367 మందికి 11 రకాల సర్టిఫికెట్లు పూర్తి ఉచితంగా అందజేయడం ఒక మైలురాయి అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెంట్రల్లో 52,519 మంది సద్వినియోగపరచుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులను పరిశీలించారు.

టిడ్కో ఇళ్లు చంద్రబాబు చేతగానితనానికి నిదర్శనం
టిడ్కో ఇళ్ల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చేతగాక చేతులెత్తేసిన టిడ్కో ఇళ్ల విషయంలో.. వైసీపీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపే ముందు.. టిడ్కో లబ్ధిదారులతో మాట్లాడే ధైర్యం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆనాడు పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని కనీసం స్థలాలు కూడా లేకుండా నగరంలో 11,917 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. కేవలం కాగితాలలో ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకు తిన్నారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని.. 5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. ఇదంతా తెలుగు తమ్ముళ్ల అవినీతి కాదా..? సమాధానం చెప్పాలన్నారు. ఆ సమయంలో డబ్బులు కట్టలేక ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల ముందు బారులు తీరడం కలిచివేసిందన్నారు. చంద్రబాబు మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. గృహ సముదాయాల వద్ద సకల మౌలిక సదుపాయాలు కల్పించి.. జనవరి నాటికల్లా అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉన్న ప్రతిఒక్క పేదవాడికి పారదర్శకంగా స్థలం కేటాయించి.. ఇల్లు నిర్మించి ఇస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 33 వేల మంది పేదల నిర్మాణాలకుగానూ అక్షరాలా రూ. 589.19 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కనుక వాస్తవాలు ప్రజలకు తెలుసని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరోసారి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, అంజిరెడ్డి, వసంత్, గోపాల్ రెడ్డి, శర్మ, తోపుల వరలక్ష్మి, శోభన్, విజయసారథి, జమలయ్య, మహేశ్వరి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *