విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 2, 3 తేదిలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, సంక్షిప్త ఓటర్ల జాబితాకు సంబంధించి నమోదవుతున్న అభ్యంతరాలు, క్లయిమ్స్లను పెండిరగ్ లేకుండా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢల్లీి రావు అన్నారు. ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు కలెక్టరేట్లో ఓటర్ల జాబితాపై జరుగుతున్న వివిధ ప్రక్రియలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 2,3 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఆ తేదీలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బిఎల్వోలు ఆయా పోలింగ్ బూత్‌లలో అందుబాటులో ఉంటారన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లయిమ్స్, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం 6,7,8 దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఆన్లైన్, అఫ్ లైన్లలో నమోదవుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. డిసెంబర్ 26వ తేదీ నాటికీ పెండిరగ్ లేకుండా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలనే ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పరిష్కారం పై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఫారం 6కు సంబంధించి నేటి వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ లలో 17,034 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో విచారించి అంగీకరించిన 10,764 దరఖాస్తులను, ఫారం 7కు సంబంధించి 24,126 దరఖాస్తులు రాగా వాటిలో 19,071 దరఖాస్తులను, ఫారం 8 లో 45,707దరఖాస్తులు రాగా వాటిలో 35,110 దరఖాస్తులను ఈ-రోల్ లో అప్డేట్ చేశామని మిగిలిన దరఖాస్తులు నిర్థేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతీ రోజు టెలి, వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఇఆర్వో, ఎఇఆర్వో, బిఎల్వోలతో ధరఖాస్తుల పరిష్కారం పై సమీక్షిస్తూన్నామన్నారు. ప్రతి దరఖాస్తును బిఎల్ఓ లు, ఏఈఆర్వో లు, ఈఆర్వోలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి విచారణ చేస్తున్నారని కలెక్టర్ డిల్లీరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
సమావేశంలో ఎఎపి పార్టీ ప్రతినిధి కె. పరమేశ్వరావు, బిజెపి పార్టీ ప్రతినిధి పి.వి శ్రీహరి, సిపిఐ పార్టీ ప్రతినిధి దోనేపూడి శంకర్, సిపియం పార్టీ ప్రతినిధి డి.వి. కృష్ణ, ఐ ఎన్ సి పార్టీ ప్రతినిధి వై.ఏసుదాస్, వైఎస్సార్ సీపీ ప్రతినిధి పి.రాజశేఖర్, టిడిపి పార్టీ ప్రతినిధి ఎల్ శివరామప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ డీటీ రాజేశ్వరి ఉన్నారు.
Prajavartha Online Telugu News