-క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయబడి జిల్లాలోని లబ్ధిదారులకు పంపిణీ చేసే 20 మురుగు శుద్ది వాహనములను (వాక్యూమ్ సక్షన్ బేసిడ్ డిస్లడ్జింగ్ వేహికల్స్) బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురుగునీరు, చెత్త నిర్మూలనకు మురుగుశుద్ధి వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. స్వచ్ఛత ఉద్యమి యోజనలో భాగంగా ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి ఆర్ధిక సహాయంతో రాష్ట్ర షెడ్యూలు కులాల ఆర్ధిక సంస్ధ వారు స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ద్వారా ఎంపిక చేయబడిన లబ్దిదారులకు 3 వేల లీటర్ల కెపాసిటీ గల డిస్లడ్జింగ్ మురుగుశుద్ధి వాహనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మురుగునీరు, చెత్తనిర్మూలన వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. వాహనం విలువ రూ. 31.67 లక్షలు కాగా ఇందులో సబ్సిడీ కింద రూ. 15.06 లక్షలు, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి రుణం కింద రూ. 16.61 లక్షలు ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కో`ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్. రవికుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రలీల ఉన్నారు.
Prajavartha Online Telugu News