Breaking News

చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ శిక్షణ మరియు ప్రదర్శన

కలవచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం స్థానిక ఉండేశ్వరపురం గ్రామం, సీతానగరం మండలంలో మల్లంపాటి సీతారామయ్య వారి (కొబ్బరి తోట) ఉద్యాన పంటల ప్రదర్శన క్షేత్రంలో కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల వారు షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక లో భాగంగా చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ పై శిక్షణ మరియు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గోకవరం, కోరుకొండ, సీతానగరం మండలాల నుండి 70 మంది గ్రామీణ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. డా. VSGR నాయుడు, హెడ్, కెవికె, కలవచర్ల మాట్లాడుతూ ఎస్సీ ఉప ప్రణాళికలో అంతర్భాగంగా మహిళా రైతులకు చిరుధాన్యాల ఆవశ్యకత – ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. ప్రస్తుత ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రతి ఒక్కరూ వారి దైనందిన ఆహారంలో సమతుల్యతతో చిరుధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారని కాబట్టి విదిగా చిరుధాన్యాలను ఆహారపు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

ఏపి సీఎన్ఎఫ్ అదనపు జిల్లా పథక సంచాలకులు షేక్ మహమ్మద్ వలి – మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కేవీకే వారు మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడు తున్నారని ముఖ్యంగా చిరు ధాన్యాలపై శిక్షణ, అవగాహన మరియు ప్రదర్శన వంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమని తెలిపారు.

కె వి కే అధికారిణి సత్యవాణి, మాట్లాడుతూ మహిళలకు చిరుధాన్యాల లోని పోషక విలువలు మరియు చిరు ధాన్యాలను ఆహారంగా జోడించడం ద్వారా కలిగే లాభాలను వివరించారు. ముఖ్యంగా 2023 వ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తింపబడడం చాలా హర్షదాయకమని తెలిపారు.

కె.వికే కలవచర్ల వారు ఈ సందర్భంగా చిరుధాన్యాలపై మహిళలకు, యువతకు అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో చిడిపి నాగభూషణం మాట్లాడుతూ మహిళలకు చిరుధాన్యాలతో గ్యాస్ ద్వారా నిర్మితమై రూరల్ బేకరీ ఓవెన్ సహాయంతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడం ప్రదర్శనగా చూపించారు. పంచదార, మైదా, బొంబాయి రవ్వ మొదలగు పదార్థాలను వాడకుండా రుచికరమైన చిరుధాన్యాల బిస్కెట్లు, కేకులు, మురుకులు, చేగోడీలు, దోశ పిండి మిశ్రమాలు మొదలైనవి తయారీలపై అవగాహన మరియు శిక్షణ కల్పించారు.

ఈ శిక్షణకు హాజరైన సభ్యులందరికీ గోకవరం మండలం దేవి చిరుధాన్యాలతో తయారుచేసిన మురుకులు, కారబూంది మిక్సర్, లడ్డూలను స్నాక్స్ గా అందజేశారు. చాలా రుచికరమైన స్నాక్స్ ను ఇంటివద్దనే తయారు చేసి సమావేశానికి హాజరైన సభ్యులందరికీ అందజేశారు. మిర్తిపాడు గ్రామ ఎంపీటీసీ శ్రీమతి దేవి మహిళలను ఉద్దేశించి చాలా వివరంగా ఆహారంలో పోషక లోపాలు వాటిని ఎలా అధిగమించాలో తెలియచేశారు. కెవికె వారు నిర్వహించిన ఈ ప్రదర్శన మరియు శిక్షణ చాలా విజ్ఞాన దాయకమైనదని ప్రతి మహిళ అతి తక్కువ ఖర్చుతో చిరుధాన్యాలతో పిల్లలు, పెద్దలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు వంటకాలు తయారు చేసుకుని ఆహారంతో పాటు భుజించాలని తెలియజేశారు. చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ అనే ఈ శిక్షణా కార్యక్రమం తమ ఉద్యాన-వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో నిర్వహించడం 70 మంది మహిళలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని మల్లంపాటి సీతారామయ్య హర్షం వ్యక్తం చేస్తూ కేవీకే కలవచర్ల వారి కృషి అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టగలరని కోరారు.

ఈ కార్యక్రమానికి ఐకార్-కేవీకే కలవచర్ల హెడ్ డా. వి ఎస్ జీ ఆర్ నాయుడు, జె. వి. ఆర్ సత్యవాణి, షేక్ మహమ్మద్ వలి, మిర్తిపాడు గ్రామ ఎంపీటీసీ శ్రీదేవి, మల్లంపాటి సీతారామయ్య , ఎపి సి ఎన్ ప్రతినిధులు రామకృష్ణ, వరలక్ష్మి, హరీష, రమేష్, కె వి కె అధికారులు టి. విజయవర్ధన్, ప్రభాత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *