Breaking News

ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు ప్రత్యేక ప్రచార దినోత్సవాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
* ఓటరు నమోదు కొరకు ది.02.12.2023 మరియు 03.12.2023 తేదిలలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు ప్రత్యేక ప్రచార దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 2 , 3 తేదిలలో బూత్ లెవల్ అధికారులు అందరూ సంబంధిత పోలింగ్ కేంద్రాల నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ది.01.01.2024 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన లేదా నిండుతున్నట్లయితే మరియు ఇప్పటివరకూ ఓటు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోని వారు సదరు పైన తెలిపిన తేదిలలో ఓటరు గా నమోదు కోరుకు(Form-6) దరఖాస్తు చేసుకొనవాలని విజ్ఞప్తి చేశారు.

* ది 27.10.2023 వ తేదీన ప్రచురించ బడిన ముసాయిదా ఓటర్లు జాబితాను పరిశీలించుకుని అందు ఏమైనా సవరణలు (పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, వయస్సు, ఫోటో మార్పు మొ..వి) ఉన్న యెడల ఫారం – 8 ద్వారా దరఖాస్తు చేసుకొనవలయునని కోరారు.

* ప్రతి వారు వారి కుటుంబంలో ఎవరైనా మరిణించి వుండి, ఇప్పటికి మరిణించిన వారి పేరు ఓటర్లు జాబితా నందు కొనసాగుచున్న యెడల సదరు విషయమును సంబందిత బి ఎల్ వో వారి దృష్టికి తీసుకుని వచ్చి మరణించిన వారి ఓటును తొలగించుటకు ఫారం 7 ద్వారా మరణ ధృవీకరణ పత్రం జత పరిచి దరఖాస్తు చేసుకొన వలయునని తెలియ చేశారు

* దరఖాస్తు విధానం (ఆఫ్ లైన్ ద్వారా) ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(తహశీల్దార్) మరియు సంబంధిత బూత్ లెవెల్ అదికారి (బిఎస్ఓ)ల కార్యాలయంలో దరఖాస్తు ఫారం లు సమర్పించవచ్చును.

* దరఖాస్తు విధానం (ఆన్ లైన్ ద్వారా) https://voters.eci.gov.in ద్వారా సమర్పించవచ్చును.

* ఓటర్ హెల్ప్ లైన్ (Voter Helpline App) ద్వారా ఫారంలను ధరఖాస్తు చేసుకొనవచ్చును. (అండ్రాయిడ్ ఫోన్ కలవారు ప్లే స్టోర్ నుంచి / ఐ ఫోన్ ఫోన్ కలవారు యప్ స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ (Voter Helpline App) యాప్ డౌన్లోడ్ చేసుకోవలయును)

* ఎన్నికలకు సంబందించి మరింత సమాచారం మరియు సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ : 1950 (జిల్లా ఎన్నికల అధికారి వారి కార్యాలయం)నకు సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *