విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి మహాసభ డిసెంబర్ 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరుగుతుందని, ఈ సభా వేదిక పై నూతన రాష్ట్ర కమిటీ ఆవిర్భావం జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు, అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కే.సుమన్ మరియు ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు లు పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభ విజయవంతనికి అలాగే ఏర్పాట్లపై ఏపీజేఏసీ అమరావతి అనుబంధ సంఘాల నాయకులు, అలాగే 26 జిల్లాల కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులతో గురువారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో సన్నాహక సమావేశం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కే సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ ఏజెన్సీల దోపిడి నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రక్షించి ఆప్కాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మెరుగైన సేవలు అందిస్తున్న విధానాన్ని అభినందిస్తూ మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి కృషి చేస్తుందని తెలిపారు. మహాసభ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతకు చిహ్నంగా భవిష్యత్తులో మారుతుందని భవిష్యత్ తరాలకు నూతనంగా ఏర్పడబోయే రాష్ట్ర కమిటీ రాష్ట్ర సంఘం దిక్సూచి కావాలన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరవుతున్నారని తెలుపుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఐక్యత కొరకు మహాసభకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అమరావతి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ టీవీ ఫణిపేర రాజు, కోశాధికారి మురళీకృష్ణ నాయుడు, ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం కోశాధికారి జ్యోతి, రాష్ట్ర పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శాస్త్రి, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరరావు, ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి బాబురావు అమరావతి జేఏసీ సభ్య సంఘాల నాయకులు ప్రతినిధులు 26 జిల్లాలు జేఏసీ చైర్మన్లు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News