విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా న్యాయ విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీచేయనున్న ఆరు స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓసీ, ఓసీ (మహిళలు), ఓసీ (లోకోమోటార్ డిజబిలిటీ), ఓసీ (ఈడబ్ల్యూఎస్), బీసీ-ఏ, ఎస్‌సీ కేటగిరీల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. నెలకు రూ. 18,500 వేతనం ఉంటుందని.. వయసు 2023, జులై 1 నాటికి 18-42 ఏళ్లు ఉండాలన్నారు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు. స్కిల్ టెస్ట్, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్, టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్ తదితరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, కృష్ణా, మచిలీపట్నంకు పంపాలని సూచించారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News