విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ వార్షిక క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన వార్షిక క్రీడా దినోత్సవం వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి పాల్గొని పాఠశాల పతాకావిష్కరణ చేశారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా ప్రతిజ్ఞ చేసి విద్యార్థులకు ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అంకమ్మ చౌదరి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఆటల విషయంలో చాలా నిబద్ధతతో ఉంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి ప్రాధాన్యత ఇస్తోంది. ఏదైనా విద్యా సంస్థలు అభివృద్ధి సాధించాలంటే విద్యతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటల ఒత్తడిని తగ్గించి, శారీరకంగా మానసికంగా ధారుడ్యాన్ని పెంచుతుంది. స్పోర్ట్స్ కోటాలో అనేక ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, ఒక డిప్యూటి కలెక్టర్ కూడా స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగాన్ని సంపాదించారు. కాబట్టి ఆడటం ఒక యోగం, ఆడిరచడం ఒక యాగం, ఆడకపోవడం ఒక రోగం అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కొన్ని క్రీడా పోటీలు మాస్ డ్రిల్, కరాటే, విన్యాసాలతోపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పాఠశాల క్రీడా వార్షిక నివేదికను పాఠశాల పి.ఇ.టి పద్మ కుమారి చదివారు. పాఠశాలలో నాలుగు విభాగాలలో జరిగిన ఇంటర్ హౌస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ఆల్ ఛాంపియన్షిప్ పొందిన గ్యాంజెస్ హౌస్‌కు, గేమ్స్ విభాగంలో ఉత్తమ హౌస్ అయిన గ్యాంజెస్ హౌస్, అథ్లెటిక్స్ విభాగంలో ఉత్తమ హౌస్ గ్యాంజెస్, మార్చ్ఫాస్ట్లో ఉత్తమ హౌస్ గ్యాంజెస్లకు బహుమతి ప్రదానం జరిగింది. డి.సాయి కార్తీక్, సి.హెచ్.శాన్వీక, బి.తేజస్వి, వి.పార్థివ్, జి.పూజిత రాయ్, ఎస్.రాహేత్య, హుస్సేన్ జాఫర్ తదితరులు విజేతలుగా నిలిచారు. విజేతలైన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ పరిమి పవన్ చంద్ అభినందనలు తెలియచేశారు. ఈ పాఠశాలలో కేవలం ఈ వార్షిక క్రీడా దినోత్సవం కోసమే కాకుండా సంవత్సరం ప్రారంభం నుండి ప్రతి విద్యార్థి స్పోర్ట్స్ మరియు గేమ్స్‌లో నైపుణ్యం పెంచుకుని జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనేటట్లు అథ్లెటిక్, ఫీల్డ్ ఈవెంట్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, త్రోబాల్, క్రికెట్ వంటి ఆటలు, కరాటే, స్కేటింగ్ మొదలైన పలు రకాల గేమ్స్, అథ్లెటిక్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె.ప్రవీణ్‌కుమార్, అకడమిక్ డైరక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపాల్ ఎం.ఎస్.భువనేశ్వరన్ మరియు వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News