విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాలకు సంబంధించి క్రీడా పరికరాల కిట్లను జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్‌కుమార్ శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల అధికారులకు పంపిణీ చేశారు. క్రీడల దిశగా యువతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలుచేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. మైదానాలను సిద్ధంచేసి, క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువులోగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని సచివాలయాలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ కోచ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News