Breaking News

దోమల నివారణకు గంబూషియా చేపల విడుదల

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల నివారణకు నీటి ఆవాసాలలో గంబూషియా చేపలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58వ డివిజన్ తమ్మిన దుర్గారావు వీధిలో శనివారం మలేరియా విభాగం ఆధ్వర్యంలో జరిగిన యాంటీ లార్వా డ్రైవ్ లో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురికి కుంటల్లో గంబూషియా చేపలను విడిచిపెట్టారు. అనంతరం దోమల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఎక్కువ రోజులు ఇళ్లల్లో నీటిని నిల్వ ఉంచకూడదని స్థానికులకు సూచించారు. దోమకాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగా ఎనాఫిలిస్, ఏడిస్ దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించే చర్యలను వీఎంసీ చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. వారంలో ఒక రోజు డ్రై డే పాటించడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని.. వ్యాధులు దరిచేరవన్నారు. గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులు, కుండీలలో కనీసం మూడు రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు శ్రద్ధ వహించాలన్నారు. ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యత గురించి ప్రచారం నిర్వహించాలని తెలియజేశారు. కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *