Breaking News

ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగపరచుకోండి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 3న నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. క్యాంపులలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) అందుబాటులో ఉండి.. ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఫారం – 6, 7, 8 లను అందిస్తారని, పూర్తి చేసిన దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, ఇప్పటికే ఓటరు కార్డు కలిగి ఉన్న వారు తప్పుల సవరణ, మార్పులు చేర్పులకు బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చన్నారు. అలాగే 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వయసు నిండే యువత.. వయసు ధ్రువీకరణ పత్రాలతో నూతన ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే వైసీపీ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *