Breaking News

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు ఒక వరం లా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ కు చెందిన మురళి కుమార్త్ పూజిత కు వైద్య సేవలు నిమిత్తం 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఆ అనుమతి మంజూరు పత్రం (LOC) అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వం లో నిర్వీర్యం చేసిన ఆరోగ్య శ్రీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు అనేక వైద్య సేవలు దాని పరిధిలోకి తెచ్చి విస్తరించారని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోని రాని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. స్థానిక నాయకులు పూజిత ఆరోగ్య పరిస్థితి గురుంచి మా దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి కి అప్లై చేయగా వెంటనే 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, నేడు వారికి ఆ చెక్కును అందజేసి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *