Breaking News

ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ జరిగింది : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులకు సూచించారు. శనివారం నాడు నియోజకవర్గ పరిధిలోని 13,14 డివిజన్ పార్టీ కార్యాలయాల్లో నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమీక్ష సమావేశాల్లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న పథకాలతో జనరంజక పరిపాలన అందిస్తున్నారని కానీ ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ మనుగడ కోసం అనుకూల మీడియా అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు త్రిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టీ ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చి బాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరవి చైతన్య, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య 13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్, ఆధ్యాక్షులు శేట్టికం దుర్గాప్రసాద్, మండల కన్వీనర్ రిజ్వాన్, క్లస్టర్ ఇంఛార్జి సన్నీ, మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *