రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం కు గానూ ఈరోజుకి ధాన్యం సేకరణకు సంబంధించి 22501 కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందని, అందులో భాగంగా 14,340 మంది రైతుల నుండి 99,819.64 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 8763 FTO లకు గాను రూ.95 కోట్ల ఒక లక్ష నగదు మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమ చేయుట జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు మరియు ఫిర్యాదుల కొరకు జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో కలదు.
కంట్రోల్ రూమ్ నంబర్లు : 8309487151, 0883-2940788 – కలెక్టరు వారి కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా.
Tags rajamandri
Check Also
అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …
Prajavartha Online Telugu News