రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం , రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికల మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీ లత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా, వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల మేరకు ఖరీఫ్ సీజన్లో కోతలు కోసిన పంటను సమీపంలోని మిల్లులకు తక్షణం తరలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా అధికారులకు, క్షేత్ర స్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశామని కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీసుకోవలసిన జాగ్రతలు:
క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలి.
కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదు.
ఇప్పటికే కోతలు పూర్తి ఐతే తక్షణం మిల్లులకు తరలించాలి.
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సంచులలో నింపి, టర్ఫలిన్స్ కప్పి ఉంచాలి.
ధాన్యం బస్తాలను ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి.
ఆఫ్ లైన్ ద్వారా కొనుగోళ్లు కు అనుమతి.
పూర్తిగా ఆరని పనలను తుఫాను వాతావరణ నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు.
పంట పొలాల్లో నీరు నిలవ ఉండకుండా బోదెలు తీసి పల్లంలోకి నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలి.
వర్షాలు తగ్గిన తరువాత వ్యవసాయ శాస్త్రవేత్తలు , అధికారుల సూచనల మేరకు మరిన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అని ఆమేరకు రైతులకు అవగాహన కల్పించాలి.
Prajavartha Online Telugu News