Breaking News

ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు పలు ప్రాంతాల్లో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో అత్యధిక భాగం ఉన్న కొండప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని కానీ నేడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మాకు సంక్షేమ పథకాలు నేరుగా మా ఇంటి దగ్గరకే అందివ్వడంతో పాటు నిత్యం నాయకులు మా దగ్గరకు వచ్చి మా బాగోగులు గురుంచి కనుక్కొంటున్నారని ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. కొండంచున ఉన్న చివరింటి వరకు కూడా అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తున్నామని, ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పోరేటర్ అంబడిపూడి నిర్మాలకుమారి, జగ్గా, పెద్దబాబు, చినబాబు, అమర్, కోటినగులు, మెయిన్,సుభాషిణి, కరిముల్లా, కనపర్తి బాబు, ముక్కు శ్రీను, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారథులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *