Breaking News

ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ… ఇండియా కూటమి నిరసన

-పాల్గొన్న కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు, ఆప్ లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉండటం పై ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష పార్లమెంట్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ… విజయవాడలో శుక్రవారం.. ఇండియా కూటమి పక్షాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. లెనిన్ సెంటర్ లో నల్ల రిబ్బన్లు, ప్ల కార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ… పార్లమెంట్ కు కూడా రక్షణ కల్పించలేని ప్రధాని మోడీ, అమిత్ షా లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ నియంతృత్వ పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఐ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ… పార్లమెంట్ పై జరిగిన దాడి పై మాట్లాడిన 146 మంది ఎంపీ లను సస్పెండ్ చేయడం దారుణమని తెలిపారు. ఏపీ లోని ప్రధాన పార్టీ ఎంపీలు..ఈ విషయం పై నోరు మెదపడం లేదని విమర్శించారు. సీపీఎం నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ఉగ్రవాద పార్టీ అని పేర్కొన్నారు. పార్లమెంట్ లో దాడి జరిగితే దాన్ని విపక్ష ఎంపీ లు అడగకూడడా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వడ్డే శోభనదేశ్వర రావు మాట్లాడుతూ… పార్లమెంట్ లో జరిగిన దాడిని, 146 మంది ఎంపీ ల సస్పెన్షన్ నూ… అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడమే మోడీ విధానమని… ఇదే విషయాన్ని అడిగిన.. రాహుల్ గాంధీని కూడా సస్పెండ్ చేశారన్నారు.. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తోపాటు కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *