Breaking News

వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి : జిల్లా వినియోగ దారుల కమీషన్ అధ్యక్షులు

-ప్రతి ఒక్క వినియోగదారుడు హక్కులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది : జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కులు, బాధ్యత గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి వుండాలి అని జిల్లా వినియోగదారుల కమీషన్ ప్రెసిడెంట్ పార్థసారథి తెలిపారు. శుక్రవారం స్థానిక తిరుచానూరు లోని జె పి హైస్కూల్ నందు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవం – 2023 అవగాహన కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల కమీషన్ ప్రెసిడెంట్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సoదర్భంగా జిల్లా వినియోగదారుల కమీషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల గురించి మరియు అవగాహన కోసం వినియోగదారుల రక్షణ చట్టం, 1986 రూపొందించబడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాన్ని లక్ష్యాన్ని స్పష్టంగా విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తువుల కొనుగోలు, అమ్మకం అనేవి తప్పనిసరి కావున వాటి విషయంలో మోసపోకుండా జాగ్రత్త వహించాలి అని తెలిపారు. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల చట్టం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు ఇటువంటి హక్కుల పట్ల తాము నేర్చుకోవడంతోపాటు చుట్టుపక్కల వారిని కూడా చైతన్యవంతులు చేయడంలో బాధ్యతగా ఉండాలన్నారు. తూనికలు, కొలతలు ISI మార్క్ ఉన్న వస్తువుల కొనుగోలు, ముగింపు తేది, మరియు MRP వంటి విషయాలపై జాగ్రత్త వహించాలన్నారు. లోప భూయిష్ట వస్తువులు, సేవల్లో లోపం మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు వంటి వివిధ రకాల దోపిడీలకు వ్యతిరేకంగా వినియోగదారులకు సమర్థవంతమైన రక్షణ అందించడం ఈ చట్టం యెక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. అవగాహన లోపం వలన వినియోగదారులు తమ హక్కులను కోల్పోవడం జరుగుతున్నదన్నారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను వారి హక్కుల సంరక్షణను కాపాడుట కోసమే వినియోగదారుల రక్షణ చట్టం 1986 అమలులోకి వచ్చిందని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాల్సిన అవసరాన్ని, నాణ్యత లోపాలపై ఫిర్యాదు చేయవలసిన విధానాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. వస్తు సేవల కొనుగోలు విషయంలో ఏదైనా అన్యాయం జరిగినచో జిల్లా వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందని తెలిపారు. హానికర వస్తు సేవల గురించి వినియోగదారులను హెచ్చరించి వారి ప్రయోజనాలు కాపాడడానికి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటైన కమిషన్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉత్పత్తిదారులు తప్పక పాటించాలి అన్నారు. విద్యార్థులు చట్టాల గురించి అవగాహన కలిగించడం కోసం వినియోగదారుల క్లబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినియోగదారుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ వంటి పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారి వారు కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ కమిషన్ సభ్యులు స్నేహలత రెడ్డి, శశిధర్ రెడ్డి, కన్జ్యూమర్ మాస్టర్ ట్రైనర్ నీలకంఠ, జిల్లా కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ ఇన్చార్జి రాజారెడ్డి, ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు, ఎస్ వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ నారాయణమ్మ, డిప్యూటీ ఈ ఓ ఆనంద రెడ్డి, పాఠశాల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *