తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి సరోజినీ దేవి లో బాలికల కోసము ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న సంరక్షణ కేంద్రమునకు స్థానిక ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్ మరియు నిత్యవసర వస్తువులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు చేతులు మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చైర్ పర్సన్ అప్పారావు మాట్లాడుతూ తిరుపతి ప్రగతి సంస్థ ద్వారా అమెరికా లో నివసిస్తున్న ఉదయశ్రీ కుమార్తె హోగిత పుట్టినరాజు ను పురస్కరించుకొని తిరుపతి లో నిర్వహించబడుతున్న బాలికల సంరక్షణ కేంద్రములోని పిల్లల కొరకు కంప్యూటరు, పుస్తకములు, వంట పాత్రలు మరియు విద్యాభివృద్దికి కావలసిన వస్తువులను సమకూర్చడం అభినందనీయం అని తెలిపారు.
ప్రగతి ద్వారా బాలికలుకు వారి అభివృద్ధి కి తోడ్పడే వివిద రకాల వస్తువులను కెవి రమణ సహృదయంతో సమకూర్చారనీ, వీటిని పిల్లలు భాగా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని కోరారు. పిల్లల సంరక్షణ కొరకు అన్నివేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అని అప్పారావుతెలిపారు. ప్రగతి డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పిల్లల హక్కుల పరీరక్షణకు మరియు వారి హక్కులను కాపాడుటకు నిరంతరం పని చేయడం జరిగుచున్నాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి శివశంకర్, ప్రగతి కోఆర్డినేటర్ తులసీరాం రెడ్డి, సిబ్బంది జయలక్ష్మి, లక్ష్మీనారాయణ మరియు సంరక్షణా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News