తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుష్ఠు వ్యాధి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా కుష్ఠు వ్యాధి రోగుల గుర్తింపు అవగాహన కార్యక్రమం అనగా లెప్రసీ కేసెస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమం (LCDC) తిరుపతి జిల్లాలో ఈ నెల డిసెంబర్ 27వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 12 వరకు మొత్తం 17 రోజులు నిర్వహించబడుతుందని జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారిని శ్రీమతి డాక్టర్ సి అరుణ సులోచన దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ ఈ కుష్టు వ్యాధి గుర్తింపు అవగాహన కార్యక్రమం సందర్భంగా ఇంటింటికీ సచివాలయ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రావడం జరుగుతుందని వారికి పూర్తి సహకారం అందించి అనుమానం ఉన్నట్లైతే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎండిటి మందులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని, కుష్టు వ్యాధి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేసి సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News