Breaking News

యేసుక్రీస్తు గొప్ప శాంతి దూత… : మేదర సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారని డ్రీమ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ అన్నారు. క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని రాష్ట్ర  ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసు క్రీస్తు అని తెలిపారు. ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున పేద ప్రజలకు దానం చేయడం వంటి గొప్ప కార్యక్రమన్నారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున పేదలను ప్రేమతో ఆదుకోవడం ద్వారా ఏసుక్రీస్తు అనుగ్రహం లభిస్తుందని, జీసస్ వరాల జల్లు కురిపిస్తాడనే క్రైస్తవ సోదరుల విశ్వాసం బైబిల్లో కూడా పేర్కొనబడిందని తెలిపారు. లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని తెలిపారు.ఏసు ప్రభు మనిషి రూపంలో జన్మించి, మనుషుల కు జీవించడానికి ఒక మార్గం చూపించారని, అందరూ కూడా అదే మార్గం లో నడవాలని ప్రతి ఒక్కరు సాటి వారి పట్ల ప్రేమ, సోదర భావం కలిగి ఉండాలని అన్నారు. ప్రజలందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలతో సంతోషాలను అందరికీ పంచాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *