భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసు క్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
Prajavartha Online Telugu News