Breaking News

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు క్రైస్తవ సోదర, సోదరీమణుల కు మాజీమంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు, పేర్ని వెంకట్రామయ్య ( నాని ) క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.
లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో ఉంటాయన్నారు. సేవాతత్పరతను యావత్ మానవాళికి బోధించిన క్రీస్తు జన్మదినం విశ్వవ్యాప్తంగా ఎంతో సంతోషకరమైన రోజు అని, ప్రజలు ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపు కోవాలని పేర్ని నాని ఆకాంక్షించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం శాంతియుత సహజీవనం ఇదీ జీసస్ మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశం అని ఆయన తెలిపారు. క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని కోరారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *