Breaking News

జాతీయ స్థాయిలో సెపక్ తక్రా అండర్ 14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ద్వితీయ స్థానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 16-12-2023 నుంచి 23-12-2023 వరకు NCT Of Delhi, ఢిల్లీ లో లో నిర్వహించిన 67వ జాతీయ స్కూల్ గేమ్స్ బ్యా సెపక్ తక్రా అండర్ 14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు టీం ఈవెంట్ నందు రజిత పథకం (runners) సాధించినది.

జట్టు సభ్యులు : పాక దుర్గా మధుర శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నాయిగూడెం, దేవరపల్లి మండలం, పశ్చిమగోదావరి జిల్లా, కల్లేపల్లి వర్షిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఊయల కావ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పటమట విజయవాడ, మిడతల వైష్ణవి శ్రీ మహేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉరవకొండ, అనంతపురం జిల్లా, గుడేకల్ సన్విత మండసూరి హిందూస్ రెసిడెన్షియల్ స్కూల్ కల్లూరు, కర్నూలు జిల్లా, టీం కోచ్ డి డానియల్ రాజ్ విజయవాడ.

టీం మేనేజర్ డి సతీష్ విజయవాడ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్  ఐఏఎస్ మరియు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఐఏఎస్ అభినందనలు తెలియజేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ కార్యదర్శి భానుమూర్తి రాజు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *