విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సింగ్ నగర్ లో సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి. రాఘవాచారి పేరుతో ఏర్పాటు చేసిన పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కార్పొరేషన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారిని ఏపీయూడబ్య్లూజే నాయకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మేయర్ భాగ్యలక్ష్మి సానుకూలంగా స్పందించారు. మేయర్ ని కలిసిన వారిలో ఏపీయూడబ్య్లూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News