-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సజావుగా ప్రారంభించేందుకు మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం తన పర్యటనలో తూర్పు నియోజకవర్గంలో బిషప్ గ్రేజీ స్కూల్,గుణదల, మధ్య నియోజకవర్గం లో మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్, పశ్చిమ నియోజకవర్గంలో కాకరపతి భవన నారాయణ కాలేజ్, వన్ టౌన్ పరిశీలించారు.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులను పరిశీలించారు, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలని, ఆడుదాం ఆంధ్ర పోటీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు, ముఖ్య అతిథులకు ఎటువంటి లోపం లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేటట్టు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమం ప్రతిదీ షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. క్రీడాకారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారే కాకుండా ఆరోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కూడా అవకాశం కల్పించాలని రిజిస్ట్రేషన్ డెస్క్ సిబ్బందికి ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వాహణ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు
Prajavartha Online Telugu News