విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒడిశా రాష్ట్రం పూరిలో జనవరి 17న జరిగే శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఒడిశా రాష్ట్ర ఉత్సవ కమిటీ అధికారులు శనివారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావును కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హిమాన్షుభూషణ్ సమరత్ తో కూడిన కమిటీ సభ్యు లైన సభాయత్ లు జై నారాయణ మహాపాత్ర, మహాకాంత్ మహాపాత్ర, మారబ్బ చంద్ర మహా పాత్రలు ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ కు అందిస్తూ జనవరి 17వ తేదీన ఒడిస్సా రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ మందిర్ పరిశ్రమ ప్రకల్ప ను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పాట్నాయక్ ప్రారంభిస్తారన్నారు. ఆలయ విశేషాలను జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ రూ.331.28 కోట్ల రూపాయల నిధులతో పూరి జగన్నాథ స్వామి ఆలయానికి 75 కిలోమీటర్లు వ్యాసార్థంలో శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప లో భక్తులకు ఆధునిక వసతులు కల్పించారని అన్నారు. శ్రీ మందిర్ రిసెప్షన్ సెంటర్ లో ఆరువేల మంది భక్తులకు వసతి కల్పించే సౌకర్యాన్ని కల్పించారని ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుకు వివరించారు.
Prajavartha Online Telugu News