Breaking News

జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ లను సాధించడం అభినందనీయం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ సర్వేక్షణ్-2023లో గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూలేని విధంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ లను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి అత్యుత్తమ ర్యాంక్ వచ్చిన సందర్భంగా బుధవారం మధ్యాహ్నం నగర పాలక సంస్థ కమిషనర్ కీరి చేకూరి, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి ర్యాంక్ మెమోంటోలను చూపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ సర్వేక్షణ్ 2023లో గుంటూరు నగరపాలక సంస్థ 2023 ఏడాదికి ఫాస్ట్ మూవింగ్ (వేగంగా అభివృద్ధి చెందుతున్న స్వచ్చ నగరాల్లో) సిటిల్లో లక్ష జనభా పైన నగరాల్లో జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్స్ తో 2వ ర్యాంక్, స్వచ్చ సర్వేక్షణ్ 2023లో 17వ ర్యాంక్ ను సాధించడం అభినందనీయమన్నారు. గతంలో 108 ర్యాంక్ లో ఉన్న నగరం ఈ ఏడాది రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాలకు ధీటుగా 17వ స్థానం సాధించడంలో మేయర్, కమిషనర్ ల మార్గదర్శనంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజారోగ్య కార్మికుల సమిష్టి కృషి ప్రదానమైనదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ద్వారా అందుకున్న ఈ ర్యాంకులతో నగర ప్రజలకు మరింత మెరుగైన పారిశుధ్యాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణంను అందించడానికి ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *