ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు వారి కార్యాలయం నందు ఆలయం నందు జరుగుచున్న అభివృద్ధి పనుల గురించి ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు కాంట్రాక్టర్ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్బంగా శనివారం కార్యనిర్వాహనాధికారి ఆలయ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగముగా మల్లేశ్వర స్వామివారి ఆలయ పనులు, అన్నదాన భవనం, ప్రసాదం పోటు, ఎలేవేటెడ్ క్యూ కాంప్లెక్స్ , తదితరములు పరిశీలించి ఆలయ అధికారులకు త్వరితగతిన పనులు పూర్తి చేయవలసినదిగా కార్యనిర్వాహనాధికారి వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి గార్లు, ఇంజినీరింగ్ సిబ్బంది, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News