Breaking News

ఎన్నిక‌ల విధుల‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న, అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం..

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లకు సంబంధించిన‌ విధుల‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌తిద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఆర్‌వో, ఏఆర్‌వో, అసెంబ్లీ స్థాయి మాస్ట‌ర్ ట్రైన‌ర్స్ (ఏఎల్ఎంటీ)ల‌కు శిక్ష‌ణ కార్‌‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ అదితిసింగ్ త‌దిత‌రులతో క‌లిసి ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ఔన్న‌త్యాన్ని ఇనుమ‌డింప‌జేయ‌డంలో స్వేచ్ఛాయుత‌, నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ దోహ‌దం చేస్తుంద‌ని.. ఎన్నిక‌ల విధులపై అధికారులు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న పెంపొందించుకోవ‌డం ద్వారా త‌మ బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించవ‌చ్చ‌న్నారు. పోలింగ్‌, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, ఐటీ వేదిక‌లు, పోస్ట‌ల్ బ్యాలెట్ త‌దిత‌ర అంశాల‌పై జిల్లాస్థాయి మాస్ట‌ర్ ట్రైన‌ర్‌తో నిర్వ‌హిస్తున్న శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని.. ఏవైనా సందేహాలు ఉంటే ఎప్ప‌టిక‌ప్పుడు నివృత్తి చేసుకోవాల‌ని సూచించారు. డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్‌, రిసెప్ష‌న్ సెంట‌ర్‌, వివిధ ర‌కాల రిజిస్ట‌ర్లు, ఫారాలు, పోలింగ్ స్టేష‌న్, ఈవీఎం త‌దిత‌రాల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. అప్‌డేటెడ్ హ్యాండ్‌బుక్‌లను ఉప‌యోగించుకోవాల‌న్నారు. స‌ర‌ళ‌మైన భాష‌లో అత్యంత నాణ్య‌మైన శిక్ష‌ణ‌ను పీవోలు, ఏపీవోలు త‌దిత‌రుల‌కు అందించాల‌ని ఏఎల్ఎంటీల‌కు క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు.
జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ మాట్లాడుతూ ఎన్నిక‌ల విధుల నిర్వ‌హ‌ణ‌కు నిబ‌ద్ధ‌త‌, అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌ర‌ని పేర్కొన్నారు. వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సూచించారు. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో జిల్లాస్థాయి మాస్ట‌ర్ ట్రైన‌ర్ బాల‌కృష్ణారెడ్డి.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈవీఎం-బ్యాలెట్ యూనిట్‌, కంట్రోల్ యూనిట్‌, వీవీప్యాట్‌లకు సంబంధించిన స‌మాచారాన్ని వీడియోల ద్వారా వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌రావు, ట్రైనీ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి, ఆర్‌డీవోలు పి.సాయిబాబు, కె.మాధవి, ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *