Breaking News

మండల స్థాయి జగనన్నకు చెబుదాంకు 69 వినతులు

-వినతులకు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

చిల్లకూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , నిర్ణీత కాల వ్యవధి లోపు ప్రజల అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.

బుధవారం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో కలెక్టర్ పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి వినతులను స్వీకరించి అక్కడే ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసారు. నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని, నిబంధనల పరిధిలో లేని పరిష్కరించలేని వాటిని అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవిన్యూ – 51, హౌసింగ్ -5, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్-3, గురుకుల పాఠశాల- 2, విద్యుత్ శాఖ-1, నీటిపారుదల శాఖ-1, వైయస్సార్ ఆరోగ్యశ్రీ-1, — పంచాయతీ రాజ్-1, పోలీసు శాఖ-1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్-1, సాంఘిక సంక్షేమ శాఖ-1, ఎన్ఫోర్స్మెంట్-1 కలిపి మొత్తం 69 వినతులు అందాయని, జిల్లా అధికారులు జేకేసీ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా జగనన్నకు చెబుదాం – స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ భాను మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *