Breaking News

చిల్లకూరులో పోలింగ్ బూత్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

చిల్లకూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన బిఎల్ఓ స్థాయి నుండి పై అధికారి వరకు వారి ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు 114, 115 ను తిరుపతి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత బిఎల్వో లతో మాట్లాడుతూ 22 జనవరి 2024 తుది ఓటర్ల జాబితా లో ఏమైనా ఫోటోలు స్పష్టంగా లేనివి ఉంటే ఫోటోలు కలెక్ట్ చేయాలని, మరణించిన వారి వివరాలు, డూప్లికేట్ ఎంట్రీ లు ఉంటే వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుందని సూచించారు. అక్కడ ఉన్న ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం,ర్యాంపులు తదితరాలను పరిశీలించారు. ర్యాంపులు నిర్నీత కొలతల మేరకు ఉండాలని, మరమ్మత్తులు ఉన్నవాటిని త్వరితగతిన పూర్తి చేయించాలని గూడూరు ఆర్డీఓ ను ఆదేశించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి వివరాలతో పూర్తి అవగాహనతో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డి ఈ ఓ శేఖర్, చిల్లకూరు తాశిల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *