Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధన ప్రైవేటుకు ధీటుగా ఉన్నాయి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

చిల్లకూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధన, రుచికరమైన పోషకాహార మధ్యాహ్న భోజనం ఏర్పాటు, పలు విద్యా కార్యక్రమాల అమలుతో ప్రైవేటుకు ధీటుగా ఉన్నాయనీ, ప్రజలు వారి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత ప్రధానోపాధ్యాయులు జాన్ పీటర్ ను అడిగి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, తాగునీటి వసతి, ఆట స్థలం, మరుగుదొడ్లు నీటి సరఫరా తో ఉన్నాయా అని పలు వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థిని విద్యార్థులకు మంచి బోధన ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మహిళలలతో మాట్లాడుతూ ప్రేమతో పిల్లలకు భోజనం అందించాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్ ను, అందులో విద్యాబోధన అంశాలు పరిశీలించారు. బై జూస్ ట్యాబ్ వినియోగంపై విద్యార్థులను అడిగి ఉపయోగకరంగా ఉందా అని అడగగా పిల్లలు సబ్జెక్టుపై పాఠశాల సమయం తర్వాత ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా మేము ట్యాబ్ లో ముందుగా లోడ్ అయిన సబ్జెక్ట్ ద్వారా నివృత్తి చేసుకోగలుగు తున్నామని చాలా ఉపయోగంగా ఉందని తెలిపారు. అనంతరం వారు కిచెన్ షెడ్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలలలో మౌలిక సదుపాయాలు నాడు నేడు ద్వారా ఎంతో బాగా రూపు దిద్దుకున్నాయని, అధునాతన స్మార్ట్ టీవీ ఏర్పాటుతో డిజిటల్ విద్య అందిస్తోందని, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం చిక్కీలు ఇవ్వడం జరుగుతోందని, పలు విద్యా కార్యక్రమాలను అమ్మఒడి జగనన్న విద్యా దీవెన తదితర పథకాల అమలుతో నాణ్యమైన విద్య పేద ప్రజలకు అందుబాటులో తెచ్చిందని ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డిఈఓ శేఖర్, డిఎంహెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ డిఈఓ శివ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *